బాలక్రిష్ణ 102వ సినిమా హీరోయిన్ నయనతార
బాలకృష్ణ 101వ సినిమా పైసా వసూల్ రేలీజ్ అవ్వకముందే 102వ సినిమా ఒకే చేసేసాడు. ఈ సినిమాకు సి.కళ్యాణ్ నిర్మాత కాగా తమిళ్ టాప్ డైరెక్టర్ కె.యెస్.రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్ నయనతారతో బాలకృష్ణకు ఇది 3వ సినిమా కావడంతో సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ నయనతార జంటగా మరో హిట్ రెడి అవుతుందని సినీ ప్రముఖులు అంటున్నారు. వీరి కాంబినేషన్లో విడుదల అయిన సింహ, శ్రీ రామ రాజ్యం ఇండస్ట్రీలో పెద్ద హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి పెద్ద హీరోలకు హిట్ ఇచ్చిన దర్శకుడు కె.యెస్.రవి కుమార్ ఈ చిత్రనికి దర్శకత్వం వహిస్తుండడంతో బాలక్రిష్ణ, నయనతార కబినేషన్ హ్యాట్రిక్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.