బేతాళుడు రివ్యూ
విజయ్ ఆంథోని – పృద్వి (సాఫ్ట్ వేర్ ఇంజినీర్)(శర్మ).
అరుంధతి నాయర్ – జయ లక్ష్మి .
కధ:
పృద్వి ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి పెళ్లి చేసుకోవాలని మాట్రిమోనీ సైటులో తన ప్రొఫైల్ పెడతాడు. ఒక అమ్మాయి తనంతట తాను పెళ్లి ప్రపోసల్ పంపుతుంది. పృద్వి ఆమెను చూడగానే ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు అనిపించి పెళ్లి చేసుకుంటాడు. అప్పటినుండి తన జీవితంలో సమస్యలు మొదలవుతాయి. హీరోకి తలలో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది తనను చనిపోమ్మని అంటూ ఉంటుంది. సమస్య ఎక్కువ అవ్వటంతో హీరో స్నేహితుడు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తాడు ఆ డాక్టర్ కరెక్ట్ కాదని అక్కడినుంచి బయటకు వచ్చేస్తారు. హీరో మరియు అతని స్నేహితుడు ఇద్దరు కారులో వస్తుండగా హీరోకి తనని చచ్చిపో అని ఒక గొంతు వినబడుతుంది కంగారు పడ్డ హీరో తన స్నేహితున్ని కారు వెనక్కి తిప్పు అని కంగారు పెడతాడు కారు రివర్స్ చేసే క్రమంలో ఆక్సిడెంట్ అవుతుంది హీరో స్నేహితుడు చనిపోతాడు. హీరో తనవల్లె ఫ్రెండ్ చనిపోయాడని కుమిలిపోతాడు. హీరో పనిచేసే కంపెనీ మేనేజర్ తన ప్రవర్తన చూసి ఒక మానసిక వైద్యుడి దగ్గరకు తిసికు వెళ్తాడు. ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో తన గత జన్మ గుర్తుకువస్తుంది. తన పేరు శర్మ అని మాచర్ల తన ఊరు అని ఇంక కొద్ది సమయంలో తను చనిపోతున్నానని డాక్టర్కి చెప్తాడు. డాక్టర్ తనని మరల నార్మల్ స్టితి లోకి తీసుకువస్తాడు.
హీరో తనకు తెలియకుండానే మాచర్ల వెళ్తాడు తనకు వినిపించే కొన్నిపేర్లు గురించి అక్కడ విచారిస్తాడు. శర్మ, జయలక్ష్మి, నటరాజు, గంగ రాజు ఎవరు అని తెలుసుకుంటాడు.
పూర్వ జన్మలో తను ఒక తెలుగు టీచర్, తను ఒక పిల్లోడిని దత్తత తీసుకోని చాకుతుంటాడు. స్కూల్ హెడ్ మాస్టర్ అవ్వటం వల్ల ఎటువంటి తప్పు జరిగిన తప్పు చేసిన వారి పట్ల చాల కటినంగా ప్రవర్తించేవాడు దాని వల్ల అతనిని బేతాళుడు అని పిలుస్తుంటారు. జయలక్ష్మి ఇల్లు గడవక శర్మ సహాయం కోరుతుంది శర్మ తనను స్కూల్లో ఉద్యోగిగా చేర్చుకుంటాడు. జయలక్ష్మి, శర్మ పెంపుడు కొడుకు పట్ల చూపే ప్రేమ వల్ల వయసు చాలా తేడ వున్నాశర్మ ఆమెని పెళ్ళిచేసుకుంటాడు.
కొన్ని రోజులు తరువాత ఆ ఊరిలోకి నటరాజు అనే ఇంగ్లీష్ టీచర్ వస్తాడు తనకు జయలక్ష్మికి సంబంధం ఏర్పడుతుంది. కొన్ని నెలలు తరువాత ఒక పిల్లోడు పుడతాడు అందరు ఆ పిల్లోడు శర్మ కొడుకు కాదని అంటారు. శర్మ మొదట నమ్మడు, కానీ పిల్లోడి చేతిమీద ఉన్న పుట్టుమచ్చ చూసి పిల్లోడు నటరాజుకి పుట్టాడని తెలుసుకుంటాడు.
శర్మ పిల్లోడిని అడిస్తుండగా చేయి జారి పిల్లోడు కిందపడి చనిపోతాడు. కోపం పెంచుకున్న జయలక్ష్మి శర్మను వదిలి నటరాజుతో వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు తరువాత ఆమె మళ్ళి వచ్చి తన తప్పుని క్షమించమని శర్మను వేడుకుంటుంది. శర్మ ఆమెని క్షమిస్తాడు, ఒక రోజు కృష్ణ నది వొడ్డున కూర్చొని జయలక్ష్మి, శర్మకు అన్నంలో విషం కలిపి పెడుతుంది అది తెలియక శర్మ ఆ అన్నం తింటాడు. ఇంతలో వెనకునుండి నటరాజు తెడ్డుతో శర్మ తలమీద కొడతాడు. శర్మ నటరాజుకి ఎదురు తిరిగే సమయానికి జయలక్ష్మి వెనుకనుంచి శర్మను కత్తితో పొడుస్తుంది అక్కడే ఆడుకుంటున్న శర్మ దత్త పుత్రుడిని కూడా కొట్టి చంపేస్తారు.
పూర్వ జన్మలో జయలక్ష్మి ఈ జన్మలో మళ్ళి తనను చంపటానికి బార్య రూపంలో వచ్చిందని తెలుసుకుంటాడు. జయలక్ష్మి రూపంలో ఉన్న తన బార్యను చంపటానికి ప్రయత్నిస్తాడు పృద్వీ. ఇదంతా హాస్పిటల్లో జరుగుతుంది అక్కడే వున్నా డాక్టర్ ఆమెని తప్పిస్తాడు. తనని పెల్లిచేసుకోవటం వల్ల పృద్వీ ఇలా ఐపోయడని తనకి దూరంగా వెళ్తున్నానని ఒక లెటర్ రాసి వెళ్ళిపోతుంది.
3 నెలలు తరువాత పృద్వీ కోలుకుంటాడు తన బార్య గురించి వెతుకుతాడు ఆమె కనబడదు. ఒక రోజు పృద్వీ తన పరుపు కింద ఒక డ్రగ్ ప్యాకెట్ చూస్తాడు. ఆ ప్యాకెట్ తిసుకోనివెల్లి డాక్టర్కి చూపిస్తాడు తన రక్తంలో ఆ మందుకి సంబందించిన ఆనవాళ్ళు కనిపిస్తాయి.
అప్పుడు అసలు విషయం బయటపడుతుంది తనకు ఇచ్చిన డ్రగ్ వల్ల తను అలా ఐపోయడని తెలుసుకుంటాడు.
అసలు ఆ డ్రగ్ ఏంటి?
పృద్వీ బార్య ఎవరు?
ఆమెకు, డ్రగ్ ముటాకు సంబంధం ఏమిటి?
నిజంగా జయలక్ష్మి ఎవరు? అనేది సినిమా హల్లో చూడాల్సిందే.