ఎక్కడికి పోతావు చిన్నవాడా రివ్యూ
సినిమా: ఎక్కడికి పోతావు చిన్నవాడా.
హీరో: నిఖిల్ సిధర్ద్.
హీరోయిన్: హెబ్భ పటేల్, నందిత శ్వేతా.
డైరెక్టర్: వి. ఐ. ఆనంద్.
కధ: అర్జున్ (నిఖిల్ సిధర్ద్) మొదటి సీన్ లోనే తను లవ్ చేసిన అయేషా తో రిజిస్టర్ పెళ్ళికి రెడీ అవుతాడు కరెక్ట్ సమయానికి అయేషా అర్జున్కి హ్యాండ్ ఇచిద్ది. 4 సంవత్సరాలు గడిచిన తరువాత అర్జున్ ఒక గ్రాఫిక్ డిసైనర్ గ వర్క్ చేస్తుంటాడు వెన్నెల కిషోర్ అర్జున్కి ఫ్రెండ్ ఒక బుతవైద్యుడి మాటలకి వెన్నెల కిశోరే మానసికంగా దెబ్బతింటాడు, అతని వైద్యం కోసం సైక్లోజికల్ డాక్టర్ని కలుస్తారు (30 ఇయర్స్ ఇండస్ట్రీ) కానీ ఉపయోగం ఉండదు. మరో భూతవైద్యుడి సలహామేరకు అర్జున్ వెన్నెల కిశోరే కేరళ వెళ్తారు అక్కడ అమల(హెబ్భ పటేల్) తో అర్జున్ ప్రేమలోపడతాడు ఒకరోజు రాత్రి అమల అర్జున్తో తెల్లవారితే నీకు ఒక విషయం చెప్తానని చెప్పకుండా వెళ్ళిపోతుంది తను చెప్పిన విషయాలు బట్టి అర్జున్ అమల అడ్రస్ కనుకొంటాడు కానీ అమల చనిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది అని తెలుసు కుంటాడు. తను ప్రేమించిన అమ్మాయి అమల కాదు అని నిత్య అని తెలుసుకుంటాడు కాకపోతే నిత్యని ఒక ఆత్మ ఆవహించి ఉందని కనుకుంటాడు. కధ మద్యలో నందిత శ్వేతా ఎంటర్ అవ్తుంది. మరి అర్జున్ తరువాత ఏమి చేసాడు అనేది మొత్తం ట్విస్ట్ తో సాగుతుంది.
డైరెక్టర్ ఆనంద్ సినిమాని ఎక్కడ బొర్ కొట్టించకుండా చాల నీటుగా చిత్రీకరించాడు.
వెన్నెల కిశోరే కామెడీ బాగుంది.