ఎంతా మోసగాడివయ్యా శివ పాట లిరిక్స్
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
Enta Mosagadivayya Siva |
Tanikelle bharani |
Veenapani |
Tanikelle bharani |
Veenapani
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా

బైటికేమొ లింగ రూపమయ్యా శివా…
బైటికేమొ లింగ రూపమయ్యా శివ, నీకు లోపల స్ర్తీ రంగ రూపమయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
పైన మూడు నామాలేనయ్యా శివా…
పైన మూడు నామాలేనయ్యా శివ, నీకు లోన వేయి నామాలంటయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
పైపైనే అభిషేకాలయ్యా శివా…
పైపైనే అభిషేకాలయ్యా శివ, నీకు అలంకారమంట లోపలయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
బైటికేమొ తోలు బట్టలయ్యా శివా…
బైటికేమొ తోలు బట్టలయ్యా శివ, నీకు లోపల పీతాంబరాలయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
నెత్తిన గంగమ్మ తల్లయ్యా శివా…
నెత్తిన గంగమ్మ తల్లయ్యా శివ, నీ కాల్ల కాడ పుట్టేనంటయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
వల్ల కాడే వైకుంఠమయ్యా శివా…
వల్ల కాడే వైకుంఠమయ్యా శివ, నీకు కాలకూఠమె అమృతమయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
కడతేర్చేవాడ వీవెనయ్యా శివా…
కడతేర్చేవాడ వీవెనయ్యా శివ, మమ్ము కాపాడేవాడ వీవెనయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
ఎంతా పిచ్చివాడవయ్యా శివా…
ఎంతా పిచ్చివాడవయ్యా శివ, నువ్వెంత మంచి వాడివయ్యా …
శివా, ఎంతా పిచ్చివాడవయ్యా శివ,
నువ్వంతా మంచి ఎంతెంతా మంచి ఎంతెంతెంతా మంచి వాడివయ్యా … శివా .