ఫిడ్జెట్ స్పిన్నర్ వల్ల వత్తిడి తగ్గుధ?
Is Fidget Spinner Really Worth For Try?
Fidget Spinner not worth for reduce stress please beware of such fake news. some video makers making video on it for selling gadget online please dont trust this gadget is for kids. this is not stress reviler.
ఈ మధ్య చాలా మంది నోట ఎక్కువగా వినిపిస్తున్న మాట ఫిడ్జెట్ స్పిన్నర్. అసలు దీనిలో ఏముంది? దీనివల్ల నిజంగా వత్తిడి తగ్గుతుందా?
ఫిడ్జెట్ స్పిన్నర్ అనేది కేవలం చిన్న పిల్లలు ఆడుకునే ఒక ఆట వస్తువు అంతకుమించి దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, కొంతమంది యూట్యూబుర్లు, వెబ్సైట్ ఓనర్లు ఈ గాడ్జెట్టుకు కేవలం ఒక్క మాటతో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చారు ఫిడ్జెట్ స్పిన్నర్ వాడటం వల్ల వత్తిడి తగ్గిపోతుంది అని. నిజానికి అది పచ్చి అబద్ధం. అలాంటి చెత్త మాటలు నమ్మి షేర్ చేసే వాళ్ళు నా దృష్టిలో బుర్ర తక్కువ వాళ్ళు.
ఫిడ్జెట్ స్పిన్నర్ వల్ల వత్తిడి తగ్గితే డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ మీద మందులు బదులు ఫిడ్జెట్ స్పిన్నర్లను వ్రాస్తారు.
జిమ్ కోచ్ మీ చేతికి ఫిడ్జెట్ స్పిన్నర్ ఇచ్చి తిప్పమంటాడు.
మీకు యోగ అవసరం ఉండదు కేవలం ఫిడ్జెట్ స్పిన్నర్ ఉంటే చాలు.
కేవలం ఆ గాడ్జెటును మార్కెట్ చేసుకోవటానికి మాత్రమే వత్తిడి తగ్గుధి అని ఒకటి కల్పించి పబ్లిసిటీ చేశారు. అది ఎంతవరకు నిజం అని ఆలోచన లేని అవివేకులు ఆ వీడియోలను, కంటెంట్లను షేర్ చేశారు.
నిజానికి ఫిడ్జెట్ స్పిన్నర్ వల్ల స్ట్రెస్ అనేది తగ్గదు అది కేవలం వ్యాపారం చేసుకోవటానికి కొంతమంది కల్పించిన మాట మాత్రమే.
ఫిడ్జెట్ స్పిన్నర్ ఎవరి దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది?
1. 10 వ తరగతి లోపు చిన్న పిల్లల దగ్గర వాళ్ల సరదాకోసం తిప్పుతారు.
2. ఇంటర్, ఇంజనీరింగ్, డిగ్రీ సమానమైన వయసు ఉన్నవాళ్లు కేవలం షో చేసే వాళ్ల దగ్గర ఉంటుంది. చదువుకొనే వాళ్ల దగ్గర ఇది కనిపించదు.
3. బేవర్స్ బ్యాచ్ దగ్గర, ఎటువంటి పని లేకుండా బజార్లో తిరిగేవాళ్ళు, ఖాళీగా కూర్చునే వాళ్ల దగ్గర, అమ్మాయిల ముందు షో చేసే వాళ్ల దగ్గర ఎక్కువగా ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ కనిపిస్తుంది.
మీరు బాగా గమనిస్తే అమ్మాయిల దగ్గర ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ 90 శాతం కనిపించదు. కేవలం 10 శాతం అమ్మాయిల దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది మిగతా 90 శాతం అబ్బాయిల దగ్గర ఉంటుంది.
మీరు చిన్న పిల్లలకు కొనివ్వాలి అనుకుంటే కొనివ్వండి తప్పులేదు మీకు స్ట్రెస్ తగ్గించటానికి మాత్రం ఇది పనికి రాదు.