నాగ చైతన్య సినిమా వార్తలు
నాగ చైతన్య గారి సినిమా వార్తలు (Naga Chaitanya Movie Updates) ఇప్పుడు మీకోసం ఈమెయిలు ద్వారా అందించబడును. నాగ చైతన్య అభిమానుల కోసం నాగ చైతన్య ప్రతి కొత్త సినిమా విషయాలు మీకు అందించటం జరుగుతుంది. మీరు చెయ్యవలసినది ఒక్కటే మీకు కనిపించే ఫాలో బటన్ నొక్కి మీ ఈమెయిలు ఇచ్చి ఓకే చెయ్యటమే. నాగ చైతన్యకు సంబందించిన సినిమాలు, పాటలు, ఫోటోలు మీకు ఈమెయిలు ద్వారా అందించబడును.
Follow
నాగ చైతన్య కొత్త సినిమా ఫస్ట్ లుక్ నాగ చైతన్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసారు సినిమా పేరు “సవ్యసాచి”. చందు మొన్దేటి ఈ సినిమాకు దర్సకత్వం వహిస్తున్నాడు. సవ్యసాచి అంటే రెండు చేతులను సమర్ధవంతంగా శక్తివంతంగా వాడేవారు అని అర్ధం. మహాభారతంలో అర్జునుడుని సవ్యసాచి అనే వారు.
మహానటి సినిమాలో నాగ చైతన్య నటించటానికి ఒప్పుకున్నాడు. స్వర్గీయ ఏ.ఎన్.ఆర్ పాత్రలో నటించడానికి నాగ చైతన్య సుముఖత వ్యక్తం చేసాడు. మహానటి సినిమాలో స్వర్గీయ సావిత్రి దేవి గారి పాత్ర కీర్తి సురేష్ పోషించనున్నారు.
కొత్తగా పెళ్ళైన జంట నాగ చైతన్య సమంతా కలిసి శివ నిర్వాన దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు ఈ విషయం నాగ చైతన్య తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది.