శైలజ రెడ్డి అల్లుడు రివ్యూ
శైలజ రెడ్డి అల్లుడు సినిమా 13 సెప్టెంబర్ 2018 రిలీజ్ అయింది ఇక సినిమా కధలోకి వెళితే అందరికి తెలిసిన కధ. అహంకారం ఉన్న వ్యక్తులను దారిలోకి తేవడం అనేది సినిమా కాన్సెప్ట్.
కధ:
మురళి శర్మ నాగ చైతన్య తండ్రి పాత్ర పోషిస్తాడు అతనికి ఉన్న అహం వల్ల కూతురి పెళ్లి చెడి పోద్ది. చైతు (నాగ చైతన్య) తన తండ్రి బిజినెస్ డీల్ చేస్తుంటాడు. చైతు జీవితంలోకి అను(అను ఇమ్మనియాల్) అనే అమ్మాయి వస్తుంది అనుకి కూడా అహం ఎక్కువగా ఉంటుంది. చైతు అను అహంకారాన్ని తొలిగించి తను ఒక సాదారణమైన అమ్మాయి అని గుర్తు చేస్తాడు. అను చైతు ప్రేమలో పడుతుంది.
ఈ విషయం చైతు తండ్రికి తెలుస్తుంది, చైతు తండ్రికి ఏవైతే లక్షణాలు ఉంటాయో అవే లక్షణాలు అనులో చూసి పెళ్ళికి వొప్పుకుంటాడు. చైతు తండ్రి అహం వల్ల అనుకోకుండా ఇంట్లో జరిగే ఒక కార్యక్రమంలో చైతుకు అనుకు నిశ్చితార్దం జరిపిస్తాడు.
అను మామ వచ్చి అనును తన వెంట తిసుకోనిపోతాడు. ఇక ఇక్కడ నుంచి రమ్య కృష్ణ (శైలజ రెడ్డి) పాత్ర ప్రారంబం. వరంగల్ లో ఒక పల్లెటూరు లో శైలజ రెడ్డి ఆడవాళ్ళను ఆదుకుంటుంది. శైలజ రెడ్డి కూతురు అను. శైలజ రెడ్డి కి కూడా అహం ఎక్కువ. చైతు అను కోసం వాళ్ళ వూరు వస్తాడు అక్కడికి వెళ్ళినాక తెలిసిద్ది అనుకి శైలజ రెడ్డికి గొడవ జరిగి 5 సంవత్సరాలు నుండి మాటలు వుండవు అని.
వీళ్ళ ఇద్దరినీ కలపటానికి చైతు అన్ని విదాలుగా ప్రయత్నం చేసి చివరకు ఇద్దరినీ తన పాజిటివ్ థింకింగ్ తో కలుపుతాడు. చివరకు తన చెల్లెలు పెళ్లి కూడా శైలజ రెడ్డి ద్వార జరిగేటట్టు చేస్తాడు. చైతు నాన్న చివరకు చైతు చేసిన పని వల్ల మారి చైతు పెళ్లి , తన కూతురి పెళ్లి శైలజ రెడ్డి ఇంట్లో జరిపిస్తాడు. కధ సుకాంతం.
దర్సకత్వం – అందరు చూసిన సినిమాను మల్ల చూపించాడు కొత్తగా ఏమి చెయ్యలేక పోయాడు.
నటులు – ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేసారు.
సంగీతం – పర్వాలేదు.
నా ఉద్దేశం – సినిమా బోరు కొట్టదు చూడొచ్చు.