సక్కని మా శివయ్య పాట లిరిక్స్
పాట పేరు (Song Name) |
పాట వ్రాసినవారు (Lyric Writer) |
గాయకులు (Singer) |
సక్కని మా శివయ్య
(Sakkani Maa Sivayya) |
బాలవర్దన్
(Balavardhan) |
వెంకి
(Venki) |
సక్కని మా శివయ్య (Sakkani Maa Sivayya) పాట ఒక ప్రైవేటు ఆల్బం నుండి సేకరించినది. పాట పాడినవారు వెంకి, వ్రాసినవారు బాలవర్దన్. ఈ పాటకు సంగీతం కూర్చినది సుకుమార్ రెడ్డి. ఈ పాటలో నటించినది తనికెళ్ళ భరణి (Tanikella Bharani).
సక్కని మా శివయ్య… అవతారం ఏందయ్యా
ఒంటినిండా దుమ్ము నింపుకొని మెదలవేందయా
పక్కనుండే పార్వతీ… పట్టనట్టుందే ఏందది
నెత్తిమీది గంగమ్మ నిను తడపడేందయా..
అరె తోలుపడి నాగులా వాసనేందయ
జోలుపట్టి ఆజంగమయ్యా నీవేశమేందయా
మంచుకొండ నీఇల్లయ్య వెండి చందమామ నీ సిగనయ్య
సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా
ఒంటినిండా దుమ్ము నింపుకొని మెదలవేందయా
పక్కనుండే పార్వతీ… పట్టనట్టుందే ఏందది
నెత్తిమీది గంగమ్మ నిను తడపడేందయా
జడలే చిక్కు ముడిలా మాసెనేందయా
అటుఇటు కానికన్ను నుదుటినేందయ
నెలవంక సందమామ నెత్తినేందయా
రూపముండి నీకు లింగపూజలేందయా
విషమే గొంతులో ఎట్టానిలుపుకొన్నావో
కాటి భూడిదని ఎట్టాపూసుకొంటావో
విషమే గొంతులో ఎట్టానిలుపుకొన్నావో
కాటి భూడిదని ఎట్టాపూసుకొంటావో
ఎట్టబడితే అట్టఉంటే అమ్మే ఎట్టాచూస్తూ ఉందయ్యా
పార్వతమ్మేఎట్టా చూస్తూఉండయ్యా
సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా
ఒంటినిండా దుమ్ము నింపుకొని మెదలవేందయా
పక్కనుండే పార్వతీ… పట్టనట్టుందే ఏందది
నెత్తిమీది గంగమ్మ నిను తడపడేందయా
కొడుకూ తలనిఎట్టా నరికినావయా
వైరాగ్యాన్ని ఎట్టా మోసినావయా
పిల్లనేఇచ్చిన మామని సంపడమేందయా
భూతగణాలతో సావాసమేందయా
బస్మ్మాసురుని కెట్టా అట్టాంటివరమిస్తివో
సతిపార్వతి నీతో ఎట్టా ఏగుతున్నదో
బస్మ్మాసురుని కెట్టా అట్టాంటివరమిస్తివో
సతిపార్వతి నీతో ఎట్టా ఏగుతున్నదో
సెడ్డకోపం వచ్చినా నిన్నెట్టా తిట్టేదయ్యా శివయ్యా
నిన్ను గుండెల్లోనే పెట్టుకుంటినయ్యా
సక్కని మా శివయ్య అవతారం ఏందయ్యా
ఒంటినిండా దుమ్ము నింపుకొని మెదలవేందయా
పక్కనుండే పార్వతీ… పట్టనట్టుందే ఏందది
నెత్తిమీది గంగమ్మ నిను తడపడేందయా